MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వేద పండితులు పూజలు నిర్వహించారు. భాద్రపద పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఆ దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారికి పూజలు చేశారు. 33 జంటలు శ్రీ సత్యన్నారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించాయి. సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో మ.12 గంటలకు దేవాలయాన్ని మూసివేశారు.