ప్రకాశం: ఈనెల 9న నిర్వహించే అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ కోరారు. అదివారం వైసీపీ కార్యాలయంలో అన్నదాత పోరు కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. అన్నదాత సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు