RR: ఆదివారం చంద్రగ్రహణం కారణంగా కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయాన్ని మూసివేశారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ అర్చకులు, అధికారులు పేర్కొన్నారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేకాలు నిర్వహించి అనంతరం యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.