GDWL: జిల్లాలో 13 మండలాలు ఉండగా 13 ఎంపీపీ, 13 జడ్పీటీసీ, 142 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 3,93,418 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,99,781 మంది ఉండగా పురుషులు 1,93,627 మంది, మరో 10 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 696 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో జాబితాను విడుదల చేశారు.