కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని ఆరోపించిన బీజేపీ కార్యకర్త ఎస్.విఘ్నేష్ శిశిర్కు ఈడీ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 9న విచారణకు హాజరై, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఈడీ ఆదేశించింది. గతంలో, శిశిర్ కోర్టులో పిటిషన్ వేస్తూ రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారని ఆరోపించాడు. కాగా, ఈడీ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించింది.