VZM: తెర్లాం శాఖా గ్రంథాలయంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి సిహెచ్ కృష్ణమూర్తి నిర్వహించారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠన అలవాటు చేసుకోవాలని ఆయన విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు, డా. జాకీర్ హుస్సేన్, అల్లావుద్దీన్ అద్భుత దీపం వంటి కథలు, నైతిక కథలు, పద్యాలు, గద్యాలు చదివి వినిపించారు.