NZB: ఆర్మూర్ పట్టణానికి చెందిన ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల LOC మంజూరు చేయించారు. ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు LOC కాపీని అందజేశారు.