TG: వినాయక నిమజ్జన సమయంలో గతేడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ తగ్గిందని సీపీ ఆనంద్ తెలిపారు. ‘నిన్న రాత్రి శోభాయాత్రలో జరిగిన గొడవల్లో 5 కేసులు నమోదు చేశాం. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1,070 మందిని పట్టుకున్నాం. పిక్ పాకెటింగ్ కేసులు కూడా నమోదు చేశాం. ఈసారి నిమజ్జనంలో సాంకేతికతను వాడాం.. 9 డ్రోన్లు ఉపయోగించాం’ అని పేర్కొన్నారు.