HNK: కాజీపేట పట్టణంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్వేతార్క గణపతి ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. నేడు చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల దర్శనానికి తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించారు. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, తిరిగి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.