NLG: చిట్యాలలోని ఆర్గానిక్ కృష్ణ మందిరం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఆలయంలో అర్చకులు ఉండరు. భక్తులే స్వయంగా పూజలు చేసుకోవచ్చు. ఇక్కడకు వచ్చే భక్తులు వసతి, భోజనం పొంది, ఎన్ని రోజులైన గడపవచ్చు. IIT పూర్వ విద్యార్థి P.వెంకటేశ్వర్లు ఈ ఆలయాన్ని పదేళ్ల క్రితం నిర్మించారు. ఆడంబరాలు కాకుండా స్వచ్ఛమైన భక్తిని చాటాలనే లక్ష్యంతో ఈ ఆలయాన్ని పచ్చని ప్రకృతి మధ్య నిర్మించారు.