TG: చర్లపల్లి వాగ్దేవి కంపెనీలో మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బంగ్లాదేశ్ యువతి ఫాతిమా మురాద్ అరెస్టుతో డ్రగ్స్ డెన్ బయటపడింది. సోదాల్లో 5.968 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ దొరకగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ విజయ్‌తో ఫాతిమాకు డ్రగ్స్ లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.