WNP: పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా MLA తూడి మేఘారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. గత పదేళ్ల నియంతృత్వ పాలనకు వనపర్తి ప్రజలు స్వస్తి చెప్పారని వెల్లడించారు.