TG: చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు వేములవాడ రాజన్న ఆలయం మూసివేశారు. రేపు తెల్లవారుజామున 3.45 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేయనున్నారు. ఉదయం 6:30 నుంచి భక్తుల దర్శనం ప్రారంభం అవుతుంది. మరోవైపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంతో సహా పలు అనుబంధ ఆలయాలను మూసివేశారు.