‘బాహుబలి’లో శివగామి పాత్ర శ్రీదేవి చేయకపోవడంపై ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్ స్పందించారు. ‘ఆ పాత్రకు నో చెప్పడానికి కారణం రాజమౌళి కాదు.. నిర్మాతలు. వారు రెమ్యూనరేషన్ తక్కువ చెప్పడం వల్ల నో చెప్పింది. మా పిల్లల వల్ల హోటల్ డిమాండ్ చేయాల్సి వచ్చింది. వారికి సెలవులు వచ్చినప్పుడు పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేయొద్దని కోరాం. కానీ నిర్మాతలు ఒప్పుకోలేదు. అది కూడా ఒక కారణమే’ అని చెప్పారు.