SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి గ్రామ శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి, ధర్మకర్త అశోక్ గౌడ్, పర్యవేక్షణలో సోమయ్య ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.