WNP: అమరచింత మున్సిపాలిటీలోని పోస్టాఫీసు సమీపంలో విద్యుత్ స్తంభం విరిగి కూలిపోయే ప్రమాదం ఉంది. పోల్ అడుగు భాగం పూర్తిగా తుప్పుబట్టి ఉండటంతో ఎప్పుడు ఎవరిమీద పడుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరెంటు సప్లై ఉన్న ఇనుప స్తంభం వల్ల నష్టం జరగకముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.