GNTR: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నిరసన చేపట్టింది. యువగళం పాదయాత్రలో లోకేశ్ ఇచ్చిన హామీని అమలు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వలి ఆదివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ నిరసనలో ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.