కృష్ణా: మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీధి కుక్కలు ప్రధాన రహదారులు ఇష్టారాజ్యంగా గుంపులు గుంపులుగా తిరుగుతూ పాదచారులను, ద్విచక్ర వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వీధి కుక్కలు రోడ్ల వెంట అడ్డంపడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.