TG: హైదరాబాద్ లంగర్ హౌస్లో కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతి మృతి చెందగా.. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.