E.G: ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.9 లక్షల చెక్కును ముగ్గురు లబ్దిదారులకు అందజేశారు. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.