శ్రీకాకుళం మండలం అరసవల్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. శక్తి టీం ఎస్సై రవి ఆధ్వర్యంలో టీం సభ్యులు భక్తులచే శక్తి యాప్ డౌన్లోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్సై అరుణకుమారి, టీం సభ్యులు యాప్ పని చేయు విధానము, ఉపయోగాలు, టోల్ ఫ్రీ నెంబర్ల వివరాలు డెమో రూపంలో భక్తులకు వివరించారు.