JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులకు నేడు రేపు ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు. కార్యకర్తలు గమనించి క్యాంపు కార్యాలయానికి రాకుండా ఉండాలని సూచించారు. మెరుగైన వైద్యం కోసం విశ్రాంతి అవసరమని వారు తెలిపారు.