KNR: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ను రైల్వే హమాలీ కార్మికులు ఆదివారం శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం రావడం మరింత బాధ్యత పెంచిందని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.