కృష్ణా: మోపిదేవిలో రైతు నర్రా నారాయణరావు మృతి చెందగా వారి కుటుంబానికి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ ఆధ్వర్యంలో ఆదివారం రూ. పది వేలు ఆర్థిక సహాయం చేశారు. సంఘ సభ్యుల సంక్షేమ నిధి నుంచి ఈ సహాయాన్ని నారాయణరావు మట్టి ఖర్చుల నిమిత్తం వారి కుమారునికి సంఘ ఛైర్పర్సన్ పరుచూరి శ్రీనివాసరావు అందచేశారు. సొసైటీ సీఈఓ శ్రీనివాసరావు, ఉప్పాల రమేష్ పాల్గొన్నారు.