SKLM: శ్రీకాకుళంలోని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సతీసమేతంగా చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్రావు తో పాటు ఆలయాన్ని సందర్శించారు.