టీమిండియా క్రికెటర్లలో స్టైలిష్గా కనిపించే వాళ్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. అయితే ఆసియా కప్ 2025 ప్రాక్టీస్ సెషన్లో అతడు ధరించిన వాచీ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. రిచర్డ్ మిల్లె RM27-04 వాచీని పాండ్యా ధరించాడు. దీని ధర రూ.20 కోట్లు అని అంచనా. ఆసియా కప్ గెలిచిన జట్టుకు (రూ.2.6 CR) వచ్చే బహుమతి కంటే ఇది 10 రెట్లు ఎక్కువ అని పలువురు కామెంట్ చేస్తున్నారు.