కృష్ణా: యూరియా సరఫరా నిరంతరం జరిగేలా జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేశారని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జహీద్ తెలిపారు. ఆదివారం చల్లపల్లి మండలం కొత్తమాజేరు పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీని అసిస్టెంట్ కలెక్టర్ ప్రారంభించారు. యూరియా పొందిన రైతులతో తప్పనిసరిగా ఐ.ఎఫ్.ఎం.ఎస్.లో బయోమెట్రిక్ వేయించాలని సిబ్బందికి సూచించారు.