TG: బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారని విమర్శించారు. మతం ప్రస్తావన లేకుండా బీజేపీ ఓట్లు అడగలేదని దుయ్యబట్టారు. తాము పూజలు చేస్తామని.. కానీ దేవుడి పేరిట ఓట్లు అడగమని స్పష్టం చేశారు.