GNTR: తుళ్లూరు మండలం రాయపూడి సమీపంలో ఆర్పీఏ-8 అంతర్గత రోడ్ల నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మంగళవారం భూమిపూజ నిర్వహించనున్నారు. ఆదివారం ఇంజినీర్లు జేసీబీలు, ఇతర భారీ యంత్రాలతో భూమిని చదును చేసే పనులు చేపట్టారు. రాయపూడి, తుళ్లూరు మధ్య ఉన్న అమరావతి లేఅవుట్లలోని ప్రధాన రహదారులను కలుపుతూ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.