NLR: జిల్లాలో గంజాయి తరలిస్తున్నారనే పక్క సమాచారంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా, రూ. 2.5 లక్షల విలువైన 23.5 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో మహేష్, వినీత్, సూర్య సాయి, రాజశేఖర్, ఫిరోజ్, మల్లికార్జున అనే ఆరుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ద్విచక్రవాహనంపై వెళ్తున్న జాకీర్ పరారయ్యాడు. శనివారం సాయంత్రం వీరిని కోర్టులో హాజరుపరిచారు.