వికారాబాద్(D)లోని దుద్యాల్(M) వాల్యానాయక్తండాలో ఓ వింత ఆచారం అమలవుతోంది. ఈ తండాకు కోడలిగా వచ్చే అమ్మాయిని గిరిజనులు సీతమ్మగా భావిస్తారు. పెళ్లయ్యాక ఆమె మాంసం, కల్లు, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. సుమారు 200 ఏళ్లుగా ఈ ఆచారాన్ని ఇక్కడి కోడళ్లు సంతోషంగా పాటిస్తున్నారు. ఇది ఒకప్పుడు తండాలో అంటువ్యాధులు వ్యాపించినప్పుడు చేసిన మొక్కుబడి అని గ్రామస్తులు చెబుతున్నారు.