దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ 2025 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సౌత్ సినీ ఇండస్ట్రీ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా తమిళం నుంచి ఉత్తమ చిత్రంగా ‘అమరన్’, అదే సినిమాకుగాను ఉత్తమ నటిగా సాయి పల్లవికి అవార్డులు వచ్చాయి. మలయాళం నుంచి ఉత్తమ మూవీగా ‘మంజుమ్మల్ బాయ్స్’, ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్(ది గోట్ లైఫ్)కు పురస్కారాలు దక్కాయి.