GDWL: మల్దకల్ మండలం తిమ్మప్ప స్వామి ఆలయాన్ని ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు ఈఓ సత్య చంద్రారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12:55 గంటలకు పూజలు ముగించి ఆలయాన్ని మూసివేస్తారు. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.