WGL: ఖానాపురం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం రైతులు యూరియా కొరతపై జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వ్యవసాయానికి అవసరమైన యూరియాను సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ రాస్తారోకో కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకున్నా రైతులు వినకుండా ధర్నా చేశారు.