AP: లిక్కర్ కేసు నిందితుల బెయిల్‌ను సవాలు చేస్తూ సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించనుంది. నిన్న ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేయగా, సిట్ దీనిపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిందితుల బెయిల్‌పై స్టే విధించాలని సిట్ కోరనుంది. అయితే, బెయిల్ వచ్చాక ఇప్పటికే నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు.