MDK: నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామ శివారులో బ్రిడ్జి కూలిపోవడంతో, సిద్ధిపేట డిపోకు చెందిన బస్సులను దారి మళ్లిస్తున్నట్లు డిపో మేనేజర్ టీ రఘు తెలిపారు. ప్రస్తుతం బస్సులు కల్వకుంట, పులిమామిడి, ప్రగతిధర్మారం మీదుగా నడుస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.