AP: సీఎం చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని మాజీమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. బెయిల్ వచ్చినప్పటికీ లిక్కర్ కేసు నిందితులను కావాలనే ఆలస్యంగా విడుదల చేశారని ఆరోపించారు. జైలు అధికారులు చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని.. ఇది రాజకీయ కక్ష సాధింపు అని విమర్శించారు. లేని స్కామ్‌ను సృష్టించి వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఆరోపించారు.