NLR: కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు కేటాయించిన నూతన 108 వాహనాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.శకుంతల ప్రారంభించారు. అత్యాధునిక లైఫ్ సపోర్ట్ పరికరాలతో కూడిన 108 వాహనం హాస్పిటల్కు సమకూరడం వలన మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుందని ఆమె అన్నారు. అత్యవసర సమయాల్లో ఈ అంబులెన్స్ సేవలను ప్రజలు వినియోగించుకోవచ్చని సూచించారు.