TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని అన్నారు. వినాయక నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన అధికారులకు, నిర్వహకులకు, భక్తులకు అభినందనలు చెప్పారు.