NLG: వినాయకుని లడ్డు వేలంపాటలో దక్కించుకునేందుకు భక్తులలో క్రేజ్ పెరుగుతోంది. గతంలో లడ్డు పొందిన వారికి మంచి జరుగుతుండడంతో భక్తులకు ఆసక్తి నెలకొంటుంది. నాంపల్లి మండల కేంద్రంలోని ఒక వినాయక మండపం వద్ద నిర్వహించిన వినాయక లడ్డు వేలం పాటలో ఒక లక్ష 16 వేల రూపాయలకు మండలంలోని ఒంటెద్దు గూడెం గ్రామానికి చెందిన దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి గెలుపొందాడు.