SRD: సిర్గాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అన్ని ముఖ్య పార్టీ మండల ప్రతినిధులకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఎంపీడీవో శారద ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంపీటీసీ, జడ్పిటిసి సాధారణ ఎన్నికలు నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లపై చర్చిస్తామన్నారు.