KMM: కామేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 8న ఉదయం 11 గంటలకు మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జీ.రవీందర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల జాబితాపై సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని కోరారు.