NLG: నార్కెట్ పల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆదివారం ఆయన చిత్రపటానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానన్నారు.