HNK: ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ఇటీవల మృతి చెందిన గొట్టిముక్కుల కుమార్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి ఆదివారం రూ. 20వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరామర్శ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ పుట్ట వెంకటరాజం, దాసరి రాజకుమార్ పాల్గొన్నారు.