AKP: చోడవరంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. గజపతినగరం గ్రామానికి చెందిన వృద్ధుడు పెంటకోట రమణ (62) పొలం పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో గోవాడ శారదనదిని దాటే ప్రయత్నంలో వరద ప్రవాహానికి నదిలో కొట్టుకు పోయాడు. రమణను గల్లంతయ్యారని గుర్తించిన వెంటనే చోడవరం ఫైర్ సిబ్బంది, గ్రామ యువకులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.
తూ.గో జిల్లాలో యూరియా అవసరానికి సరిపడా అందుబాటులో ఉందని కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 2025 ఖరీఫ్ సీజన్లో 21 వేల మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,667 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతుల అవసరాలకు తగిన మోతాదులో స్టాక్ అందుబాటులో ఉందన్నారు.
ASR: ప్రతీ ఒక్కరూ నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని డీఎంహెచ్‌వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు, పాడేరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి పిలుపునిచ్చారు. శనివారం 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ నుంచి సర్వజన సాధారణ ఆసుపత్రి వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. నేత్రదానంపై ఉన్న అపోహలు తొలగించాలన్నారు.
KDP: సిద్దవటం పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ చోరీకి గురైంది. ఈ మేరకు బాధితుడి వివరాల మేరకు.. డిసెంబర్ 4న ఉదయం 9 గంటల సమయంలో కడపకు వెళుతూ పోలీస్ స్టేషన్ సమీపంలోని గాలి మిషన్ వద్ద బైక్‌ను ఉంచామన్నారు. దీంతో రాత్రి 9 గంటలకు వచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదని చెప్పారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
ASR: గిరిజన ప్రాంతంలో బయటి వ్యక్తులు వ్యాపారం చేయడానికి, ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశం లేదని అరకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోస్య ప్రేమ్ కుమార్ శనివారం అన్నారు. కాఫీ తోటలకు సోకిన బెర్రీ బోరర్ తెగులుపై అనుమానం వ్యక్తం చేశారు. టాటా కంపెనీతో కాఫీ కొనుగోలుపై ఒప్పందం చేసుకున్న తర్వాత బెర్రీ బోరర్ తెగులు వచ్చిందన్నారు. బెర్రీ బోరర్ కుట్ర బయట పెట్టాలన్నారు.
VZM: స్థానిక జిల్లా కోర్టు సమావేశ మందిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై శనివారం అవగాహన కల్పించారు. బాలల పరిరక్షణ చట్టాల అమలులో నిధుల కొరత, అవగాహన లేకపోవడం, సిబ్బంది కొరత, ప్రత్యేక పోలీస్ యూనిట్ల లోపం, శిక్షణ పొందిన మానవ వనరుల కొరత, వసతి గృహాల కొరత వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు.
ATP: జేసీ ప్రభాకర్ రెడ్డిని బాల్యం నుంచి పెంచి అండగా ఉన్న బావ సోమనాథ్ రెడ్డి మరణించారు. ఆయన మరణంతో ప్రభాకర్ రెడ్డి తీవ్ర విషాదంలో ఉన్నారని టీడీపీ నేతలు తెలిపారు. మరోవైపు ఇదే సమయంలో జేసీ దివాకర్ రెడ్డి మనవరాలు కుమారుడికి జన్మనిచ్చారని చెప్పారు. ఒకే రోజు జేసీ కుటుంబంలో విషాదం, సంతోషం ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
GNTR: కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలను ఏవో శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. వ్యాపారులు ఎవరైనా యూరియా కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, ఎవరైనా అధిక ధరలకు అమ్మితే వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
అన్నమయ్య: రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం గోవిందంపల్లి కొత్తపల్లి గ్రామనివాసి నూకరాజు సుధాకర్ యాదవ్‌గారు మృతి చెందగా, శనివారం నాడు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు గారు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోనసీమ: మండపేటలో ప్లాస్టిక్ వాడకం నిషేధం అమల్లో ఉందని మండపేట పారిశుధ్య నిర్వహణ తనిఖీదారు ముత్యాల సత్తిరాజు అన్నారు. కమీషనర్ టివి. రంగారావు ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పలు షాపులపై ఆకస్మిక దాడులు చేశారు. మొత్తం 20 షాపులలో 7 సింగిల్ యూస్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ క్యారి బ్యాగ్‌లను గుర్తించారు. రూ. 6,650 ఫైన్లు వసూలు చేశారు.
KDP: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సిద్ధవటం మండలంలోని ICDS భాకరాపేట సెక్టారులో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు శనివారం హ్యాపీ కిడ్స్ హైస్కూల్ కరస్పాండెంట్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మంది అంగన్వాడీ కార్యకర్తలకు పూలమాలవేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కృష్ణా: చల్లపల్లి మండలం మంగళాపురం పీఏసీఎస్‌లో రైతులకు 15.075 టన్నుల యూరియా సరఫరా చేశారు. ఏవో కే మురళీకృష్ణ మాట్లాడుతూ.. త్వరలో మిగిలిన రైతులకు కూడా సొసైటీ ద్వారా యూరియా అందిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. సొసైటీలతో పాటు ప్రైవేట్ దుకాణాల ద్వారా యూరియా సరఫరా పెంచటానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
TPT: నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హర్ నెస్సింగ్ ఇన్నోవేషన్స్ (NIDHI) పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో భాగంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అనంతరం ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల వరకు మద్దతు లభిస్తుంది అని తెలిపారు.
KDP: సంపూర్ణ అభియాన్ సత్కార కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులను మెడల్‌తో సత్కరించారు. అనంతరం వారిని ప్రోత్సహిస్తూ అభినందించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు. కాగా, మరింత మెరుగ్గా వారి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
సత్యసాయి: ధర్మవరంలో లోకేంద్ర హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఈ కేసులో భూచిపల్లి బాలకృష్ణ రెడ్డి, సయ్యద్ ఇలియాజ్, దేరంగుల అంజినేయులు అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి మారుతి స్విఫ్ట్ కారు, రెండు కోడవళ్ళు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.