ATR: శెట్టూరు మండలంలోని ముద్దలాపురం గ్రామానికి చెందిన కురుబ ఈశ్వరప్ప (65) అనే వృద్ధుడు తన భార్య అంజినమ్మతో 25 ఏళ్లుగా మనస్పర్థలతో వేరుగా ఉంటున్నాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని ఈశ్వరప్ప, శనివారం ఉదయం తన పొలంలోని చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతని అన్న కోడలు జ్యోతి గుర్తించి, బంధువులకు సమాచారం ఇచ్చింది.