TPT: శ్రీకాళహస్తి 14వ వార్డులోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో మురికినీరు నిలిచిపోతోంది. దీంతో దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద దుకాణదారులు చెత్త వేయడంతో పరిస్థితి దారుణంగా మారిందని, కాలువల్లో వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.