W.G: రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నరసాపురానికి చెందిన కొలచన శ్రీపద్మ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ పద్మ ప్రస్తుతం నరసాపురం పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని, బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.