కృష్ణా: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల తర్వాత సెప్టెంబర్ 6న మచిలీపట్నంలో ఘనంగా ముగిశాయి. బీచ్ సహా పలు చెరువుల వద్దకు గణేశ్ విగ్రహాలను శోభాయాత్రల రూపంలో తీసుకెళ్లి, డప్పులు, భజనలు, బాజాలతో “గణపతి బప్పా మోరియా” నినాదాలతో భక్తులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, మున్సిపల్ శాఖలు బీచ్ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు.