• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు PGRS కార్యక్రమం రద్దు: ఎస్పీ

అన్నమయ్య జిల్లాలో ఈ నెల 27న భారీ వర్షపాతం అవకాశం ఉన్న నేపథ్యంలో, రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించాల్సిన PGRS కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు SP ధీరజ్ శనివారం తెలిపారు. వాతావరణ సూచనల ప్రకారం సోమవారం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SP పేర్కొన్నారు.

October 26, 2025 / 05:09 AM IST

పంటల నమోదు గడువు పొడిగింపు

ATP: రైతుల సౌకర్యార్థం ఖరీఫ్ పంటల నమోదు గడువును వ్యవసాయశాఖ అధికారులు ఈ నెలాఖరు వరకు పొడిగించారు. జిల్లాలో 19.11 లక్షల ఎకరాల లక్ష్యంలో ఇప్పటివరకు 15.53 లక్షల ఎకరాలు నమోదు అయ్యాయని తెలిపారు. రబీ సాగు ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

October 26, 2025 / 05:07 AM IST

8 మంది జూనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్

CTR: చిత్తూరు జిల్లా పరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 8 మంది జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందారు. ప్రమోషన్ ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు సంబంధిత ఉద్యోగులకు జడ్పీ కార్యాలయంలో శనివారం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు పాల్గొన్నారు.

October 26, 2025 / 05:04 AM IST

27న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

ATP: అనంతపురంలోని కలెక్టరేట్‌లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని ప్రజలు తమ సమ్యలపై అర్జీలు సమర్పించొచ్చని సూచించారు. అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.

October 26, 2025 / 04:59 AM IST

ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమీక్ష

SS: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పట్టణంలోని తన కార్యాలయంలో 27న బేగార్లపల్లి గ్రామంలో జరగనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ఘనంగా జరపాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, డా. శ్రీనివాస్ మూర్తి, మండల నాయకులు పాల్గొన్నారు.

October 26, 2025 / 04:56 AM IST

ఈ నెల 27న PGRS కార్యక్రమం నిర్వహణ

KRNL: ఈ నెల 27న పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం జరుగుతోందన్నారు. మున్సిపల్ డివిజన్ స్థాయిల్లో కూడా ఇదే కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

October 26, 2025 / 04:30 AM IST

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

TPT: మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న మార్గంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే SI హరిచందన మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, మృతుడి వయసు 38 ఏళ్లు ఉంటుందని, గ్రే కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, గ్రే కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు.

October 25, 2025 / 09:45 PM IST

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విజిలెన్స్ ఎస్పీ

SKLM: స్థానిక డీసీసీబీ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని శనివారం సాయంత్రం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాల చార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువా వేసి సత్కరించారు.

October 25, 2025 / 08:51 PM IST

టీడీపీ నాయకులు గోలి బాలజోజికి ఎమ్మెల్యే నివాళి

GNTR: ఫిరంగిపురం గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు గోలి బాలజోజి అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆయన పార్ధివదేహాన్ని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.

October 25, 2025 / 08:43 PM IST

పీపీపీ విధానంపై జగన్ రెడ్డికి అవగాహన లేదు: MLA శంకర్

SKLM: మాజీ సీఎం జగన్ అవాస్తవాలను మాట్లాడుతున్నారని శ్రీకాకుళం MLA గొండు శంకర్ అన్నారు. MLA క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా ఎదుట ఆయన మాట్లాడారు. జగన్ పరిపాలనకు విసిగిన ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకు వస్తున్న పీపీపీ విధానంపై జగన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని, దేశంలో పలు నిర్మాణాలను ఈ పద్ధతిలో కట్టారన్నారు.

October 25, 2025 / 08:43 PM IST

కుప్పంలో గోడ కూలి వ్యక్తి మృతి

CTR: కుప్పంలో గోడ కూలి మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు శివయ్య (52) తన అల్లుడితో వచ్చి అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ పారిశుద్ధ్య కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. నంద్యాల(D) ఆళ్లగడ్డకు చెందిన శివయ్య నెల్లూరుకు చెందిన తన అల్లుడితో పారిశుద్ధ్య పనులు చేసేందుకు కుప్పం వచ్చాడు. అయితే శనివారం జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందాడు.

October 25, 2025 / 08:40 PM IST

లారీ ఓనర్లు, డ్రైవర్లుకు అండగా ఎమ్మెల్యే

NTR: బూడిద టెండర్ రద్దు చేయాలనీ 37 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్న లోకల్ లారీ ఓనర్లు, డ్రైవర్లు దీక్షలు విరమించారు. వారి చేత MLA వసంత కృష్ణప్రసాద్ శనివారం దీక్షలను విరమింప చేశారు. దీనిపై అసెంబ్లీలో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని వారి పోరాటానికి ప్రత్యక్షంగా అండగా నిలిచినట్లు తెలిపారు.

October 25, 2025 / 08:38 PM IST

ఆధ్యాత్మిక భావాలు పెంచుకోవాలి: ఎమ్మెల్యే గొండు

SKLM: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంచుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని దండి వీధిలో శ్రీరామ మందిర నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ఆధ్యాత్మిక భావాలతో అందరిలోనూ ఐకమత్యం జరుగుతుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహాయం అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

October 25, 2025 / 08:31 PM IST

తణుకులో ఏడుగురు యువకులు అరెస్ట్

W.G: తణుకులో ఏడుగురు యువకులను అదుపులకు తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఇవాళ తెలిపారు. పాలాడి భాను ప్రకాష్, కాకరపర్తి బాలాజీ, కాకరపర్తి గణపతి, పితాని విజయబాబు, గుబ్బల ఉదయ్, బొడ్డు షారోన్, కండేటి సత్యనారాయణలను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 4,300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

October 25, 2025 / 08:29 PM IST

‘అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలి’

ASR: సమ్మె విరమించిన పీహెచ్‌సీల వైద్యులు సోమవారం పాడేరు డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి రిపోర్టు చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి శనివారం తెలిపారు. తుఫాను నేపథ్యంలో 64 పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. గర్భిణులను బర్త్ వెయిటింగ్ రూమ్‌లకు తరలించాలన్నారు.

October 25, 2025 / 08:27 PM IST